షిర్డీ సాయి భక్తులకు అద్భుత అవకాశం.. సాయి సమాధిని స్పృశించే అవకాశం!

  • ఇప్పటి వరకు వీఐపీ భక్తులకు మాత్రమే సాయి సమాధిని తాకే అవకాశం
  • సాధారణ భక్తులకు, సమాధికి మధ్య గాజు అద్దం
  • సాయి సంస్థాన్ తాజా నిర్ణయంపై భక్తుల హర్షం 
షిర్డీ సాయి భక్తులకు ఇది గొప్ప వార్తే. ఇకపై సాయిబాబా దర్శనం కోసం షిర్డీ వెళ్లే భక్తులకు సాయి సమాధిని స్పృశించే భాగ్యం కూడా కలగనుంది. ఇప్పటి వరకు వీఐపీ భక్తులకు మాత్రమే సాయి సమాధిని తాకే అవకాశం ఉండేది. ఇప్పుడు సాధారణ భక్తులకు కూడా ఆ అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాయి సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి భాగ్యశ్రీ బనాయత్ తెలిపారు. 

నిజానికి ఒకప్పుడు సాయి సమాధిని తాకే అవకాశం అందరికీ ఉండేది. అయితే, భక్తుల రద్దీ నేపథ్యంలో ఆ తర్వాత భక్తులకు, సాయి సమాధికి మధ్య గాజు అద్దాన్ని అడ్డుగా పెట్టారు. దీంతో అప్పటి నుంచి సాయి సమాధిని స్పృశించే అవకాశం సాధారణ భక్తులకు లేకుండా పోయింది. తాజాగా, మరోమారు ఆ అవకాశాన్ని తీసుకురావడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Shirdi Sai
Sai Devotees
Sai Samadhi

More Telugu News